చిల్లకూరు, జూన్ 27 (ప్రజా అంతరంగం)
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన చిల్లకూరు మండలం పొన్నపూరివారిపాలెంలో పర్యటించే అవకాశం ఉన్నందున, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలి" అని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం చిల్లకూరు మండలంలోని పర్యటన ప్రాంతాన్ని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌తో కలిసి జేసీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇంకా రావలసి ఉందని, అయితే సమయం తక్కువగా ఉన్నందున ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ అధికారులకు స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్‌డీఓ అరుణ కుమారి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజ కుమారి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డీపీఓ వసుమతి, డీఎస్పీ గిరిధర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Andhra
సీఎం నారా చంద్రబాబు నాయుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి - జేసీ మొగిలి వెంకటేశ్వర్లు
Quick Summary:
అధికారులతో జేసీ సమావేశం