చిల్లకూరు (గూడూరు), జూలై 1 (ప్రజా అంతరంగం)
గూడూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని, ఈ విషయాన్ని తాను మీసం మీద మెలేసి మరీ అత్యంత ధీమాగా చెబుతున్నానని గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. జూలై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను పురస్కరించుకుని చిల్లకూరు మండలం పున్నెపువారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గూడూరు నియోజకవర్గ ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా, వారి ఆకాంక్షలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. జిల్లాల విభజన సమయంలో గూడూరును నెల్లూరు జిల్లా నుండి వేరు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే.. నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సుదీర్ఘ కోరిక, ఆకాంక్షల మేరకు గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలోనే విలీనం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.
గూడూరు నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే.. కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇక్కడ నిజమైన, శాశ్వతమైన అభివృద్ధి పనులు జరిగాయని సునీల్ కుమార్ గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ పాలనలోనే నియోజకవర్గంలోని మౌలిక వసతుల కల్పన, సాగునీరు, తాగునీరు మరియు పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో గూడూరును జిల్లాలోనే అత్యంత అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Andhra
గూడూరు అభివృద్ధి ప్రదాత చంద్రబాబే.. మీసం మెలేసి చెబుతా - ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
Quick Summary:
‘ప్రజావేదిక’లో గూడూరు శాసనసభ్యుడి ఉద్వేగభరిత ప్రసంగం