నెల్లూరు, జులై 1 (ప్రజా అంతరంగం)
లేడీ డాన్ అరుణ మరోసారి వార్తల్లో కి ఎక్కింది అరుణపై నెల్లూరు జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ పెట్టడంతో వ్యవస్థలను ప్రభావం చేస్తుందన్న ఉద్దేశంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆమెను కడప సెంట్రల్ జైలు కు తరలించిన విషయం తెలిసిందే . గత ఏడాది అరుణపై నెల్లూరు ,తిరుపతి , గుంటూరు తదితరాల జిల్లాలో అనేక రకాలైన బెదిరింపులు మోసం , గంజాయి , కేసులు నమోదు అయిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు గత ఏడాది అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే .
ఈ నేపథ్యంలో తాజాగా అరుణ తల్లి ఆదిలక్ష్మి తమ కుమార్తె నిడుగుంట అరుణ పై ఉన్న కేసులు ఎత్తివేసి రిమాండ్ నుంచి విడుదల చెయ్యాలని రాష్ట్ర హోం మంత్రిని అభ్యర్ధించారు . దీనికి హోం శాఖ సమాధానం చెబుతూ అరుణపై అనేక రకాలైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆమెపై ఉన్న పీడీ యాక్ట్ తో సహా వివిధ రకాలైన కేసులను తోసిపుచ్చలేమని సమాధానం చెప్పింది . నిడుగుంట అరుణ ఏపీ లోనే లేడీ డాన్ గా సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే . జీవిత ఖైదీ అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ ను అడ్డంపెట్టుకొని అనేక రకాలైన సెటిల్మెంట్ లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి . తిరుపతి రియా ఆస్పత్రిలో రౌడీ షీటర్ శ్రీకాంత్ ను అనారోగ్యం పేరుతో తరలించి రాసలీలలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ వీడియో లో వైరల్ గా మారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు రేకెత్తించాయి . ఎమ్మెల్యేల అండదండలతో శ్రీకాంత్ ను పెరోల్ పై బయటకు తీసుకొని రావాలని హోం శాఖలో భారీ ఎత్తున లాబీయింగ్ నడిపించిందన్న ఆరోపణలు అరుణపై ఉన్నాయి . ఈ నేపథ్యంలో ఆమె తల్లి ఆదిలక్ష్మి కోరికను మన్నించలేమని ఆమెపై ఉన్న కేసులు అన్ని ఎదావిదిగా కొనసాగుతాయని తేల్చి చెప్పింది . దింతో లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్న అరుణ జైలు నుంచి విడుదల అయ్యే విషయం తాత్కాలికంగా బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు .
Andhra
‘లేడీ డాన్’ అరుణకు చుక్కెదురు
Quick Summary:
కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదన్న హోంశాఖ