కువైట్ మరియు బహ్రెయిన్ దేశాలపై ఇరాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడులను ఖతార్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ఇరాన్ పదేపదే చేస్తున్న ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేయడమేనని ఖతార్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. ఎలాంటి కారణం లేని ఇటువంటి దాడుల వల్ల ప్రాంతీయంగా తలెత్తే తీవ్ర పరిణామాల నుండి మధ్యప్రాచ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు పక్షాలు దూకుడు తగ్గించి, దౌత్యపరమైన చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని ఖతార్ సూచించింది. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల ఆధారంగా ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలలో శాంతిభద్రతలను, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఈ క్లిష్ట సమయంలో తాము కువైట్, బహ్రెయిన్ దేశాలకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఖతార్ విదేశాంగ శాఖ రీతరునో నొక్కి చెప్పింది.
iran
బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు
Quick Summary:
కువైట్, బహ్రెయిన్ దేశాలకు ఖతార్ పూర్తి మద్దతు