నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతన పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల మెరుగుదలే ధ్యేయంగా శనివారం ఉదయం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలాలు, మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా అటవీ శాఖ అధికారి , ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌లతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. రూరల్ పరిధిలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకు సంబంధించి అటవీ, రెవెన్యూ శాఖల పరంగా ఉన్న సాంకేతిక అంశాలను త్వరితగతిన పరిష్కరించి నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రూరల్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Andhra
నెల్లూరు రూరల్‌లో పరిశ్రమల స్థాపనపై మంత్రి నారాయణ ప్రత్యేక సమీక్ష
Quick Summary:
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక రివ్యూ