నెల్లూరు , జూలై 1 (ప్రజా అంతరంగం)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో బుధవారం మాజీ మంత్రులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నెల్లూరు నగరంలోని పావని అపార్ట్‌మెంట్‌లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రులు.. ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శించిన వారిలో మాజీ మంత్రులతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు మరియు అనుబంధ విభాగాల ప్రతినిధులు ఉన్నారు.
Andhra
శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు అనిల్, ప్రసన్న
Quick Summary:
శ్రీకాంత్ ను ఓదార్చి, సానుభూతి తెలిపిన మాజీ మంత్రులు