రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర సరఫరా జరిగేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది" అని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు. శనివారం తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక రైతన్నలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి, నీటి సరఫరాపై క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అధికారులతో కలిసి సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల పరిధిలోని తెలుగు గంగ బ్రాంచ్ కెనాల్‌ను, దానికి సంబంధించిన ప్రధాన గేట్లను ఆమె నేరుగా సందర్శించి పరిశీలించారు. చివరి ఆయకట్టు రైతుకు కూడా సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన నీటి సరఫరాపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, కూటమి నాయకుడు నెలవల పార్థసారథి, తహశీల్దార్ రాజేంద్ర, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Andhra
సాగు, తాగునీటికి అంతరాయం లేకుండా చూస్తాం -ఎమ్మెల్యే విజయశ్రీ
Quick Summary:
రైతాంగానికి నిరంతరం సాగునీరు