నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ములుమూడి గ్రామంలో 83 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ములుమూడి కలుజు వంతెనను ఆదివారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కలిసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు తాము ఇచ్చిన మాట ప్రకారం కేవలం 6 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ కలుజు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి చూపించారని అభినందించారు. తన దృష్టికి ఏ ప్రజా సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం వైపు నుండి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ సహకారంతో ములుమూడి కలుజు బ్రిడ్జిని వేగంగా పూర్తి చేయగలిగామన్నారు. ఇదే పట్టుదలతో మరో రెండు నెలల వ్యవధిలోనే పొట్టేపాలెం కలుజు మీద నిర్మిస్తున్న వంతెనను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక ముఖ్య నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Andhra
ములుమూడి కలుజు బ్రిడ్జి ను ప్రారంభించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
Quick Summary:
ఇచ్చినమాట కోటంరెడ్డి బ్రదర్స్ నిలబెట్టుకున్నారు