కోవూరు, ఆగస్టు 2 (ప్రజా అంతరంగం)
జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. కోవూరు నియోజకవర్గం, కొడవలురు మండలం రాచర్లపాడు సమీపంలోని హైవేపై ఈ దారుణ ఘటన జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఒక గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం ఢీకొట్టిన వాహనం, బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఘటన స్థలంలో బైక్ కూడా కనిపించకపోవడం గమనార్హం.
సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, యువకులిద్దరూ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పరారీలో ఉన్న వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Andhra
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం
Quick Summary:
కోవూరు పరిధిలోని రాచర్లపాడు సమీపంలో విషా