అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, జూలై 1 (ప్రజా అంతరంగం)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ రెండు కళ్లుగా సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో బుధవారం ఉదయం నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెంచిన పింఛన్ సొమ్మును అందజేసి, స్థానిక ప్రజలతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గత 2 సంవత్సరాల కాలంలోనే ఎక్కడా అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను చేరవేస్తూ, ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి రూరల్ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్‌చార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు కుర్రా పద్మాకర్ రెడ్డి, కుర్రా శ్రీనివాసులు రెడ్డి, ముత్యంశెట్టి శ్రీనివాసులు, నాతా వెంకటేశ్వర్లు, ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి, తాటిపర్తి వెంకటేష్, సంజీవయ్య మరియు కూటమి శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
india
అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు- కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
Quick Summary:
దేవరపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ